YSR Congress Party | 27 నియోజకవర్గాలకు వైసీపీ కొత్త ఇన్చార్జీల నియామకం..!
YSR Congress Party | త్వరలో జరిగే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోసం ఏపీలోని అధికార వైసీపీ సన్నద్దమవుతున్నది. మంగళవారం నేతలతో సంప్రదించిన తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి.. 27 లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు సమన్వయకర్తలను ప్రకటించారు.
YSR Congress Party | ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కోసం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) సన్నద్ధం అవుతున్నది. అందుకోసం నియోజకవర్గాల వారీగా ఇన్ చార్జీల రెండో జాబితాను మంగళవారం విడుదల చేసింది. మొత్తం 27 మంది ఇన్ చార్జీల జాబితాను రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. నేతల మధ్య విస్తృత చర్చల తర్వాత వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి ఈ జాబితాను తయారు చేసినట్లు సమాచారం.
‘మరో నాలుగు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రయత్నిద్దాం. ఈ సెగ్మెంట్లోనైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే.. పార్టీ బలపడేందుకు మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది. అందుకు మీరంతా సహకరించాలి. భవిష్యత్ లో తగిన గుర్తింపు ఇస్తాం` అని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణాలే లక్ష్యంగా ఈ జాబితా రూపొందించినట్లు తెలుస్తున్నది.
అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా వైసీపీ ఇన్ చార్జీల జాబితా ఇదే
అనంతపురం పార్లమెంట్ – మాలగుండ్ల శంకరనారాయణ
హిందూపురం పార్లమెంట్ – జోలదరాశి శాంత
అరకు పార్లమెంట్ (ఎస్టీ) -కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి
రాజాం (ఎస్సీ) – డాక్టర్ తాలె రాజేశ్
అనకాపల్లి – మలసాల భరత్ కుమార్
పాయకరావు పేట (ఎస్సీ) – కంబాల జోగులు
రామచంద్రాపురం – పిల్లి సూర్య ప్రకాశ్
పీ గన్నవరం ఎస్సీ- విప్పర్తి వేణుగోపాల్
పీఠాపురం – వంగా గీత
జగ్గంపేట – తోట నరసింహం
ప్రత్తిపాడు – పరుపుల సుబ్బారావు
రాజమండ్రి సిటీ – మార్గాని భరత్
రాజమండ్రి రూరల్ – చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
పోలవరం ఎస్టీ – తెల్లం రాజ్యలక్ష్మి
కదిరి – బీఎస్ మక్బూల్ అహ్మద్
ఎర్రగొండ పాలెం (ఎస్సీ) – తాటిపర్తి చంద్రశేఖర్
ఎమ్మిగనూరు – మాచాని వెంకటేశ్
తిరుపతి – భూమన అభినయ్ రెడ్డి
గుంటూరు ఈస్ట్ – షేక్ నూరి ఫాతిమా
మచిలీపట్నం – పేర్ని కృష్ణమూర్తి
చంద్రగిరి – చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
పెనుకొండ – కేవీ ఉషా శ్రీ చరణ్
కల్యాణ దుర్గం – తలారి రంగయ్య
అరకు (ఎస్టీ) – గొడ్డేటి మాధవి
పాడేరు (ఎస్టీ) – మత్స్యరాస విశ్వేశ్వర రాజు
విజయవాడ సెంట్రల్ – వెల్లంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ వెస్ట్ – షేక్ ఆసిఫ్.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

