అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖను మారుస్తామంటూ గంజాయి రాజధానిగా మార్చిన ఘనత వైసీపీకి దక్కుతుందని టీడీపీ (TDP) ఏపీ నూతన అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్(Palla Srinivasa Rao ) ఆరోపించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ రాజధాని(Visaka Captial)గా చేస్తామంటూ ప్రజలను ఆశల పల్లకిలో కూర్చొబెట్టి దందాలకు పాల్పడి మోసగించారని ఆరోపించారు. భూ దోపిడీలకు పాల్పడ్డారని విమర్శించారు.
చంద్రబాబు నాయకత్వంలో విశాఖను ఆర్థిక రాజధానిగా మారబోతుందని పేర్కొన్నారు. 30లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన పోలవరాన్ని(Polavaram), రాజధాని అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో ఐదేండ్లలో పూర్తి చేస్తామని ధీమాను వ్యక్తం చేశారు.
రాజకీయంగా టీడీపీ శ్రేణులపై పెట్టిన కక్షపూరిత కేసులను వందరోజుల్లో మాఫీ చేయిస్తామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల ఏర్పాటును ప్రజలంతా హర్షిస్తున్నారని ఆయన అన్నారు. అంతకు ముందు విశాఖ టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.