లోక్‌సభ స్పీకర్ కు వైఎస్ వివేకా కుమార్తె లేఖ..
YS Viveka's daughter| మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి ముప్పెట ఉచ్చు బిగిస్తుంది. ఇప్పటికే పలువురు హత్యకు
అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి ముప్పెట ఉచ్చు బిగిస్తుంది. ఇప్పటికే పలువురు హత్యకు సంబంధిన పాత్రదారులు, సూత్రదారుల వివరాలను సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. కాగా ఈరోజు వైఎస్ వివేకానంద కుమార్తె సునీతారెడ్డి కూడా తన తండ్రి హత్య వెనుక ఎంపీ అవినాష్‌రెడ్డి హస్తముందని అతడి పాత్రపై విచారణ జరిపించాలని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు. సీబీఐకి తానిచ్చిన వాంగ్మూలంతో పాటు, నిందితులిచ్చిన వాంగ్మూలాలను కూడా స్పీకర్‌కు ఆమె అందజేశారు.
కాగా ఈరోజు ఆమె సీబీఐకి ఇచ్చిన వాగ్ములంలో పేర్కొన్నా వివరాలను సునీతారెడ్డి బయటపెట్టారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైఎస్ జగన్ వివేకా హత్యను రాజకీయ సానుభూతి కోసం వాడుకున్నారని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. మా నాన్నను ఎవరు చంపారో అందరికీ తెలుసని ఆమె అన్నారు.నాన్న హత్యపై భారతి, జగన్ చాలా తేలిగ్గా తీసుకున్నారని, ఈ హత్య విషయంలో జగనన్న వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని పేర్కొన్నారు. హత్య గురించి అనుమానితుల పేర్లను జగనన్నకు చెబితే ‘వాళ్లను ఎందుకు అనుమానిస్తున్నావు.. నీ భర్తే హత్య చేయించాడేమో’ అని అన్యాయంగా మాట్లాడారని వెల్లడించారు.
కేసు సీబీఐకి అప్పగిస్తే అవినాష్‌కు ఏమీకాదు.. బీజేపీలో చేరతాడు . ఇప్పటికే మాపై 11 కేసులున్నాయి.. మీది 12వది అవుతుందని అన్నారని’ ఆమె వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

