అమరావతి : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) వైసీపీ అధినేతకు, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఘాటుకు లేఖ రాశారు. అసెంబ్లీకి వెళ్లలేని ఎమ్మెల్యేలు తక్షణమే పదవులకు రాజీనామా (Resign) చేయాలని మంగళవారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిమాండ్ చేస్తూ లేఖను విడుదల చేశారు.
వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలను గమనించే ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్లనని జగన్ (Jagan) చెబుతున్నారు. స్వయంకృతాపరాధమేతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తించాలని సూచించారు. వైసీపీకి 11 సీట్లు ఇచ్చిన కృతజ్ఞతనైనా ఉండాలి కదా అంటూ నిలదీశారు. అసెంబ్లీకి(Assembly) వెళ్లనని జగన్ అహంకారం, అజ్ఞానం బయట పడుతుందని ఆరోపించారు. బయట మాట్లాడుతాం. ఇంట్లో కూర్చుని మాట్లాడతం అంటే సరిపోదని , అసెంబ్లీకి వెళ్లి మాట్లాడాలని వైసీపీ ఎమ్మెల్యేలకు (YCP MLAs) సూచించారు.
అసెంబ్లీ పోవడానికి ధైర్యం లేదా. సామర్ద్యం లేదా జగన్ సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోసారి పోటికి నిలబడితే అసెంబ్లీకి వెళ్లమని , గెలిపించినా అసెంబ్లీకి వెళ్లబోమని ప్రజల నుంచి రిఫరెండం తీసుకోవాలని అన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు, సమస్యలను పరిష్కరించేందుకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని అన్నారు.
అసెంబ్లీకి వెళ్లకపోతే ప్రజలను మోసం చేయడం కాదా అంటూ ప్రశ్నించారు. నేడు అసెంబ్లీలో మాట్లాడేవారే కరువయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో ఆయా వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని , కేటాయింపులపై అడిగే బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేలకు ఉందని గుర్తు చేశారు.