YS Jagan | ఏపీలో అరాచక పాలన కొనసాగుతున్నది : వైఎస్ జగన్
YS Jagan | ఏపీ స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో చంద్రబాబు సర్కార్ అరాచకానికి పాల్పడుతున్నదని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Jagan | ఏపీ స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో చంద్రబాబు సర్కార్ అరాచకానికి పాల్పడుతున్నదని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా లు చోట్ల జరుగుతున్న విధ్వంసకాండపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చట్టం, న్యాయం ఉందా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఆగడాలు రోజు రోజేకు మితిమీరిపోతున్నాయని పేర్కొన్నారు. కనీసం నామినేషన్ల కూడా వేయనివ్వడం లేదు. టీడీపీ నేతలకు పోలీసులు సహకరిస్తున్నారని మండిపడ్డారు. అధికారులు కనీసం నామినేషన్ పత్రాలు తీసుకోవడం లేదన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఎందుకు అరెస్ట్లు చేస్తున్నారు? ఎందుకు కిడ్నాప్లు చేస్తున్నారు?
వైఎస్సార్సీపీ అభ్యర్థులపై పోలీసులు కాల్పులు జరపడమేంటి?. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జ్ ఎలా చేస్తారు?. స్థానిక ఎన్నికలకు ముందు నుంచే కుట్రలు మొదలు పెట్టారు అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇష్టానుసారంగా డివిజన్లు, వార్డులను విభజించారు. రిజర్వేషన్లు వారికి కావాల్సిన చోట ఇచ్చుకున్నారు. క్యాస్ట్, నో డ్యూస్ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. వైఎస్సార్సీపీ నేతలను బైండోవర్ పేరుతో పోలీసులు బెదిరించారు. ఇన్ని దారుణాలు చేసికూడా ధైరంగా ఎన్నికలకు వెళ్లలేకపోయారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అరాచకపాలనను కొనసాగిస్తున్నారని విమర్శించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

