అనంతగిరి నుంచే మూసీ ప్రక్షాళన చేపట్టాలి
వికారాబాద్ జిల్లా అనంతగిరిలో పుట్టిన మూసీ నది మూలం నుంచే ప్రక్షాళన చేయాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలంపల్లి వద్ద ఉన్న మురుగు నీటి శుద్ధి కేంద్రం(ఎస్టీపీ)ని మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్, మహేశ్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు.
-
మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి
వికారాబాద్, నవంబర్ 14 : వికారాబాద్ జిల్లా అనంతగిరిలో పుట్టిన మూసీ నది మూలం నుంచే ప్రక్షాళన చేయాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలంపల్లి వద్ద ఉన్న మురుగు నీటి శుద్ధి కేంద్రం(ఎస్టీపీ)ని మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్, మహేశ్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
మూడున్నర ఏండ్ల నుంచి మురుగు నీటి శుద్ధి కేంద్రం మరమ్మతులు చేయకుండా పడావు పట్టించారని మండిపడ్డారు. ఎస్టీపీకి మరమ్మతులు చేయాలని గతంలో అసెంబ్లీలో హరీశ్‌రావు చర్చించారని గుర్తు చేశారు.మూసీ నదిని రూ.1.50 లక్షల కోట్లతో సుందరీకరణ చేస్తామని ప్రగల్బాలు పలుకుతున్న సీఎం వికారాబాద్‌లో మూసీ పుట్టిన చోటే కలుషితం అవుతుంటే ఎందుకు పట్టించుకోవడంలేని ప్రశ్నించారు. మురుగు నీరు అంతా మూసీ ద్వారా గండిపేటకు చేరడంతో ఆనీరు తాగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే ఎస్టీపీకి మరమ్మతులు చేసి, శుభ్రమైన నీటిని అందించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

