అమరావతి : ఏపీలో తలెత్తిన విపత్తుపై మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు(Union Minister Rammohan Naidu) ఆరోపించారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా తప్పుడు ప్రచారాలు ఆపలేదని దుయ్యబట్టారు.
వరదలపై తప్పుడు ప్రచారంతో లబ్దిపొందాలని చూస్తుందని విమర్శించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెట్టినవారిపై చర్యలుంటాయని హెచ్చరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డ్రోన్ల (Drones) సాయంతో చంద్రబాబు బాధితులను ఆదుకుంటున్నారని పేర్కొన్నారు.
తన పనితీరు ఏంటో మరోసారి నిరూపించుకున్నారని, ఇంటింటికెళ్లి బాధితులకు బరోసా కల్పిస్తున్నారని వివరించారు. చంద్రబాబుతో (Chandra Babu) ప్రధాని మోదీ, అమిత్ షా అన్ని వివరాలు తెలుసుకుంటున్నారని వెల్లడించారు. కేంద్రం అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తుందని అన్నారు.