Jagan Convoy | కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో మాజీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద జగన్ కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో పలువురికి గాయాలయ్యాయి. దీంతో ఆ దారిలో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. జగన్ ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరగకపోవడంతో ఆయన సురక్షితంగా ఉన్నారు.
కాగా, తుపాన్ ప్రభావిత గ్రామాల్లో పర్యటించి, రైతులను పరామర్శించేందుకు తాడేపల్లి నుంచి బయల్దేరి పెనమలూరు, పామర్రు, పెడన నియోజకవర్గాలకు వైఎస్ జగన్ బయల్దేరారు. ఈ క్రమంలోనే కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. అయితే పోలీసులు ఎంత మొర పెట్టుకుంటున్నా వినకుండా ఇష్టారీతిన కాన్వాయ్ ముందుకు వెళ్తోందని పలువురు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. వైఎస్ జగన్ పర్యటనకు పోలీసులు, ఏపీ ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలంటూ పోలీసులు షరతులు విధించారు. కేవలం 500 మంది, 10 వాహనాలకు మాత్రమే అనుమతినిచ్చారు. ద్విచక్రవాహనాలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. దీనిపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణాజిల్లా గండిగుంట వద్ద జగన్ కాన్వాయిలో ఒకదానికొకటి గుద్దుకున్న కార్లు. భారీగా ట్రాఫిక్ జామ్. నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా?#IconNewsBreakings #YSJagan #AndhraPradesh pic.twitter.com/3JJ1tUsRin
— Icon News (@IconNews247) November 4, 2025