అమరావతి : టీడీపీ శ్రేణుల హత్యాయత్నానికి గురైన అంబటి రాంబాబు ( Ambati Rambabu ) ను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( YS Jagan ) ఫోన్లో పరామర్శించారు. ఈ సందర్భంగా అంబటికి ధైర్యం చెప్పారు. రాష్ట్రం జంగిల్‌రాజ్‌గా మారిపోయిందని జగన్ పేర్కొన్నారు.
చంద్రబాబు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారని, ఆయన దుర్మార్గాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని విమర్శించారు. ఉద్దేశపూర్వకంగానే అంబటిపై దాడి జరిగిందని ఆరోపించారు. కూటమి అరచకాలను ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షకుల్లా వ్యవహరించారని మండిపడ్డారు. పార్టీ మొత్తం అంబటికి అండగా ఉంటుందని వివరించారు.