అమరావతి : ఏపీలో కూటమి పాలన ( Allaiance Ruling ) పై యువత తీవ్ర అసంతృప్తిలో ఉందని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఆరోపించారు. తాడేపల్లి పార్టీ కార్యాలయం నుంచి వైసీపీ( YCP ) రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు, యువకులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ ( Fees Reimbursment ) బకాయిలు విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. మొత్తం రూ. 3,990 కోట్ల మేరకు ఫీజు రీయిబర్స్మెంట్ బకాయిలు ఉంటే ఈ బడ్జెట్లో కేవలం రూ. 2,600 కోట్లు మాత్రమే కేటాయించడం దుర్మార్గమని పేర్కొన్నారు.
విద్యార్థుల సంఖ్యను కుదించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఈనెల 12న యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ ప్రతినిధులకు సూచించారు.