అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై వైసీపీ స్క్రీనింగ్ షురూ!
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేండ్ల సమయం ఉండగానే.. వైసీపీ తమ పార్టీ అభ్యర్థులను స్క్రీనింగ్ చేసే పని చేపట్టింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన సెగ్మెంట్లలో తగిన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు...
విజయవాడ: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేండ్ల సమయం ఉండగానే.. వైసీపీ తమ పార్టీ అభ్యర్థులను స్క్రీనింగ్ చేసే పని చేపట్టింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన సెగ్మెంట్లలో తగిన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు స్క్రీనింగ్ ప్రక్రియను ప్రారంభించింది. ‘మిషన్ 2024’ పేరుతో కార్యాచరణ ప్రారంభించిన వైసీపీ.. అన్ని సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యాన్ని సాధించాలనేది ముందస్తు ప్రణాళికగా పెట్టుకున్నది.
2019 ఎన్నికల తర్వాత వైసీపీలోకి ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యేలకు పార్టీ టిక్కెట్లు దక్కే అవకాశాలు ఉండగా.. పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే పలువురు పేర్లను ప్రకటించడం పార్టీ వ్యూహంలో భాగమని తెలుస్తున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజల నాడిని అంచనా వేయడానికి పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐపీఏపీ) బృందాలలో అధికార పార్టీ ఒత్తిడి తెచ్చింది. ఈ బృందం వైసీపీ ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేసి.. 40 మంది పనితీరు బాగా లేదని తేల్చింది. ఈ నివేదికను అనుసరించి రానున్న నెలల్లో వారి పనితీరును మెరుగుపరచుకోవాలని పార్టీ హైకమాండ్ ఇప్పటికే ఆదేశించింది.
అంతేకాకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేల అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రత్యర్థి వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గన్నవరంలో కొన్ని గ్రూపు గొడవల వెనుక ఫిరాయించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ ఇంఛార్జీ యార్లగడ్డ వెంకటరావు హస్తం ఉన్నట్లుగా తేలింది. దీంతో అభ్యర్థులను ముందుగానే అనధికారికంగా ప్రకటించి విభేదాలను పరిష్కరించేందుకు హైకమాండ్ ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో కుప్పం అభ్యర్థిగా కేఆర్జే భారత్‌ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర ఇటీవల ప్రకటించారు.
పార్టీ ప్లీనరీ సందర్భంగా గన్నవరం నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరును మాజీ మంత్రి కొడాలి నాని ప్రకటించారు. మచిలీపట్నం నుంచి పేర్ని వెంకటరామయ్య పోటీ చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఆయన కుమారుడు కృష్ణమూర్తిని రంగంలోకి దింపాలని చూస్తున్నారు. ఇదే విషయాన్ని మచిలీపట్నం ప్లీనరీలో కొడాలి నాని ప్రస్తావించి.. తమ పార్టీ అభ్యర్థిగా కృష్ణమూర్తి పేరును ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ, చీరాల, వైజాగ్ వెస్ట్ నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్‌ను అభ్యర్థులుగా పరిగణిస్తున్నట్లు ఇప్పటికే సంకేతాలు పంపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

