అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA )జనసేన నేతను కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికలు త్వరలో జరుగనున్న తరుణంలో వైసీపీకి చెందిన అసంతృప్త ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఒక్కొక్కరు ఇతర పార్టీల్లో జాయిన్ అవుతున్నారు. తాజాగా ఆదివారం చిత్తూరు ఎమ్మెల్యే (Chittoor MLA) ఆరెని శ్రీనివాసులు(Srinivasulu) పవన్‌కల్యాణ్‌ను కలవడం సంచలనం కలిగించింది.
వైసీపీ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తూరు అసెంబ్లీ ఇన్చార్జ్గా విజయానందరెడ్డి(Vijayananda Reddy)ని నియమించడంతో శ్రీనివాసులు నిరాశలో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం లేదన్న సమాచారంతో పవన్‌ను కలిసినట్లు సమాచారం. కాగా ఇటీవల వరుసగా నలుగురు ఎంపీలు, ఎమ్మెల్యేలు టీడీపీ, జనసేనలో చేరిన విషయం తెలిసిందే.