Rayalaseema | వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విమర్శించారు. వైసీపీ పాలనలో ఆ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించారని అన్నారు. రాయలసీమలో జగన్కు ఒక్క ఓటు కూడా రాదని వ్యాఖ్యానించారు.
అధికారంలో లేకపోయినప్పటికీ వైసీపీ కుట్ర రాజకీయాలు మానడం లేదని జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. రైతుల ముసుగుతో అన్నదాతలను వైసీపీ దగా చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో యూరియా సంక్షోభం సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. రైతు సమస్యలపై చర్చించే ధైర్యం ఉంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ రావాలని సవాలు విసిరారు. అసెంబ్లీలో అడుగుపెడితే వైసీపీ ఎమ్మెల్యేలకు ఒక గంట సమయం ఎక్కువ ఇచ్చేందుకు తాము సిద్ధమని స్పష్టం చేశారు.
ఇక చంద్రబాబు పాలనను జీవీ ఆంజనేయులు ప్రశంసించారు. సంక్షోభాలను సైతం అవకాశాలుగా మార్చుకోవడంలో చంద్రబాబును మించిన వారు లేరని ఆయన అన్నారు. కరవు సీమలో కార్లను పరిగెత్తించిన ఘనత బాబుకే దక్కుతుందని కొనియాడారు. హంద్రీనీవాలో నీళ్లుపారించి సస్యశ్యామలం చేశారని అన్నారు.