తిరుపతి : తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ శిల్ప శిక్షణ సంస్థలో ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు సంప్రదాయ శిల్పకళ – అనుబంధ అంశాలపై వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మూడు రోజుల పాటు 12 మంది నిష్ణాతులు పలు అంశాలపై ఉపన్యసిస్తారని పేర్నొన్నారు. శిల్పశాస్త్రాల ప్రకారం దక్షిణ భారతదేశంలో ఆలయాల నిర్మాణం, హిందూ ఆలయాల పరిణామక్రమం, లోహ శిల్పాల తయారీ విధానం, విగ్రహప్రతిష్ట విధానం, సంప్రదాయ చిత్రకళలో మెళకువలపై నిపుణులు వివరిస్తారని వివరించారు.
శిల్ప శాస్త్రాల్లో ప్రతిమా లక్షణాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆలయ నిర్మాణ మెళ కువలు, శైవ, వైష్ణవ, శాక్తేయ ఆగమాలపై ఉపన్యాసం, భారతీయ రేఖాచిత్రాల చరిత్ర , దక్షిణ భారతదేశ ఆలయాల్లో ప్రసా దాల ప్రాముఖ్యత, సుధా శిల్పాల తయారీ విధానం, ఆలయాల నిర్మాణానికి సంబంధించిన అంశాలు ఉన్నా యని వెల్లడించారు.