 
                                                            అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మహిళలు బయటకు రావాలంటే భయపడుతున్నారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రలో నేరగాళ్లు చెలరేగిపోతున్నారని విమర్శించారు. జరుగుతున్న ఘటనలో ఒక్కరికైనా శిక్ష పడివుంటే నేరగాళ్లకు భయం పుట్టేదని తెలిపారు.
విజయవాడ ఘటనను మరవక ముందే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో తిరుపతమ్మ (40) అనే మహిళపై అత్యాచారానికి ఒడిగట్టి ఆమెను హత్య చేయడం దారుణమని అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
 
                            