Vasireddy Padma | వైసీపీ నుంచి తప్పుకున్న ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ( Vasireddy Padma) టీడీపీలో చేరనున్నారు. శనివారం ఆమె పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్ని(MP Kesineni Chinni) ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. మరో వారం రోజుల తరువాత టీడీపీలో (TDP) జాయిన్ అవుతానని ప్రకటించారు.
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో అప్పటి నుంచి వైసీపీ పార్టీకి పద్మ దూరంగా ఉంటున్నారు. పార్టీ కోసం ప్రాణాలు పెట్టిన కార్యకర్తలు అవసరం లేదనుకునే జగన్.. గుడ్‌బుక్ పేరుతో మరోసారి మోసంచేయడానికి సిద్ధపడుతున్నారని మండిపడ్డారు. జగన్‌కు పార్టీని నడిపించడంలో, పరిపాలన చేయడంలో బాధ్యత లేదని, సమాజం పట్ల అంతకన్నా బాధ్యత లేదని విమర్శించారు.
మరో వైపు వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఆళ్లనాని (Allanani) కూడా టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణుల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో టీడీపీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తుంది.
ఆళ్లనానిని తీసుకుంటే జరుగబోయే పరిణామాల గురించి వాకబు చేస్తోంది. ఆళ్లనానిని వ్యతిరేకిస్తున్న వారిని బుజ్జగించే పనులను నియోజకవర్గానికి చెందిన కీలక నేతకు బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు శాంతిస్తే ఆళ్లనాని రాక సులభతరం అవుతుందని భావిస్తున్నారు.