అమరావతి : ఏపీ మంత్రివర్గ సమావేశం (AP Cabinet) సచివాలయంలో శుక్రవారం జరుగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో (Chandrababu) పాటు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, చీఫ్ సెక్రటరీ, మంత్రులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం, గీత కార్మికులకు 10 శాతం మద్యం దుకాణాల (Liquor Shops) కేటాయింపు, రాష్ట్రంలో మరో 62 అన్న క్యాంటీన్ల ఏర్పాటు, రాష్ట్ర స్థూల ఉత్పత్తి, వృద్ధిరేటు పెంపు, ధాన్యం సేకరణ(Paddy Purchase) ,చెల్లింపుల కోసం మార్క్‌ఫెడ్‌కు రూ. 700 కోట్ల రుణ సేకరణపై సమావేశంలో చర్చించనున్నారు.
ప్రకాశం బ్యారేజ్ దిగువన కుడివైపు రిటైనింగ్ వాల్‌కు రూ. 294 కోట్లకు అనుమతి, అందరికీ ఇళ్లు పథకం విధివిధానాల జారీకి ఆమోదం తెలిపే అవకాశముంది . గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపే అవకాశంపై చర్చించే అవకాశముంది.