Chandra Babu | అంబేద్కర్‌పై వ్యాఖ్యలు దుమారం వేళ.. చంద్రబాబు సంచలన ఆరోపణలు
Chandra Babu | ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra Babu) ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ (Ambedkar) పై తీవ్ర ఆరోపణలు చేశారన్న ఇండియా కూటమి నేతల ఆందోళలనపై చంద్రబాబు వ్యాఖ్యలు (Sensational allegations ) ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
గురువారం ఏపీ కేబినెట్ అనంతరం మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ( Congress) హయాంలో అంబేద్కర్‌కు తగిన గౌరవం లభించలేదని, అంబేద్కర్ ఓడిపోయింది కూడా కాంగ్రెస్ హయాంలోనేనని పేర్కొన్నారు.
వీపీ సింగ్ హయాంలో ( VP Singh Government ) పార్లమెంట్ ఆవరణలో విగ్రహం ఏర్పాటు జరిగిందని, స్వాతంత్య్రం వచ్చి నాటిన నుంచి ఇప్పటి వరకు అంబేద్కర్‌కు ఎవరి ద్వారా గుర్తింపు వచ్చిందనే దానిపై చర్చ జరుగాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కూటమి నేతలు సున్నిత అంశాలపై జాగ్రత్తగా ఉండాలని, మంచి ఉద్దేశంతో మాట్లాడినా.. చెడుగా ప్రచారం చేసేవారు ఉంటారని తెలిపారు. గతంలో వ్యవసాయం దండగ అని అనకున్నా .. అన్నట్టు ప్రచారం చేశారని మంత్రులకు గుర్తు చేశారు.
రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయం సేకరిసున్నానని, మంత్రులుగా, ప్రభుత్వ పరంగా ప్రజల నుంచి సమాచారం తెప్పిస్తున్నానని వెల్లడించారు. ఆరు నెలల పనితీరుపై ముగ్గురు మాత్రమే మంత్రులు రామానాయుడు, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాసు మాత్రమే సెల్ఫ్ అప్రైజల్ ఇచ్చారని తెలిపారు.
మంత్రులు క్షేత్రస్థాయి పర్యటనలు పెంచాలని, సోషల్ మీడియాను మంత్రులు సద్వినియోగం చేసుకోవడం లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కక్ష సాధింపులు కాకుండా, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని సూచించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
Cop Dies After Pushed | పటాకులు కాల్చడంపై వాగ్వాదం.. పోలీస్ అధికారిని తోసేయడంతో మృతి
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

