అమరావతి : ఏపీని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి టూరిస్ట్ హబ్( Tourist hub )గా మారుస్తామని మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) వెల్లడించారు. కోనసీమ జిల్లా పిచ్చుకలంక పర్యాటక ప్రాంతాన్ని ఒబెరాయ్ గ్రూప్ (Oberoi Group) ప్రతినిధులతో కలసి మంత్రి, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, బండారు సత్యానంద్రావు, అధికారులు సందర్శించారు. ధవళేశ్వరం (Davaleshwaram) సర్ ఆర్దర్ కాటన్ బ్రిడ్జి వద్ద ఉన్న 56 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని వారు పరిశీలించారు.
రాష్ట్రంలో గండికోట, తిరుపతి, విశాఖలో ఒబెరాయ్ సంస్థ రిసార్ట్స్ నిర్మాణాలు చేసేందుకు ఒబెరాయ్ అంగీకారం తెలిపిందని, అదే కోవలో పిచ్చుకలంకలోనూ రిసార్ట్స్ నిర్మాణం జరిగితే పర్యాటక ప్రాంతంగా గుర్తింపు వస్తుందని మంత్రి దుర్గేష్ తెలిపారు.
ఉభయ గోదావరి (Godavari Districts) జిల్లాల్లో ఉన్న టెంపుల్ ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కేరళను మించి అందాలు కోనసీమ జిల్లాలో ఉన్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పర్యాటక రంగం తరఫున సహకారం అందిస్తామని వివరించారు.