పరోక్ష సేవలను మరింత విస్తృతం చేస్తాం : శ్రీశైలం ఈఓ
పరోక్ష సేవలను మరింత విస్తృతం చేస్తాం | శ్రీశైల దేవస్థానం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి రాలేని భక్తుల కోసం మెదలుపెట్టిన పరోక్షసేవలను మరింత విస్తృతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.

శ్రీశైలం : శ్రీశైల దేవస్థానం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి రాలేని భక్తుల కోసం మెదలుపెట్టిన పరోక్షసేవలను మరింత విస్తృతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.
కొవిడ్ కారణంగా క్షేత్రానికి వచ్చి నిత్య ఆర్జిత సేవల్లో నేరుగా పాల్గొనే అవకాశం లేనందున భక్తులు ఆన్లైన్ ద్వారా నిర్ణీత సేవల్లో తమ గోత్రనామాలు నమోదు చేసుకునేందుకు www.srisailadevasthanam.org వెబ్సైట్ ద్వారా వీలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
అదే విధంగా వెబ్సైట్ నుంచి నేరుగా స్వామి అమ్మవార్లకు మెక్కులు, కానుకలు సమర్పించేందుకు వీలుగా ఈ హుండీని కూడా అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన వెల్లడించారు.
ఆన్లైన్ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి విభూది, కైలాస కంకణాలు, పసుపు, కుంకుమలను పోస్టల్ ద్వారా పంపిస్తామని చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా భక్తులు స్వామి అమ్మవార్ల కైంకర్యాలను ఇంటర్ నెట్లో శ్రీశైల టీవీ ప్రసారాలను వీక్షించవచ్చని
ఈఓ తెలిపారు. మరింత సమాచారానికి కాల్ సెంటర్ 8999901951,52,53,54,55,56 నెంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

