YCP Former MP | ఎందుకు ఓడిపోయామో తెలియడం లేదు : వైసీపీ మాజీ ఎంపీ
YCP Former MP | ఏపీలో వైసీపీ ఓటమికి గల కారణాలను తెలుసుకోవడానికి ఆ పార్టీకి చెందిన మాజీలు అన్వేషణలో పడ్డారు.
అమరావతి : ఏపీలో వైసీపీ ఓటమికి గల కారణాలను తెలుసుకోవడానికి ఆ పార్టీకి చెందిన మాజీలు అన్వేషణలో పడ్డారు. ఫలితాలు వెలువడి ఐదు రోజులు కావస్తున్న జరిగిన పొరపాటును సవరించు కోవడానికైనా తమకు ఏం చేయాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. రాజమహేంద్రవరం మాజీ పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్(Former MP Bharat) మీడియా సమావేశంలో మాట్లాడారు.
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ (YS Jagan) చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూస్తే జగన్ను మరోసారి పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తారని అనుకున్నాం . గడపగడపకు తిరిగిన సమయంలో ప్రజల ఆదరణను చూస్తే వైసీపీ (YCP)కి భారీ మెజార్టి వస్తుందని భావించాం. కాని అనుహ్యంగా ఓడిపోయాం. ఏం జరిగిందో ఇంకా అంతుచిక్కడం లేదని పేర్కొన్నారు. ప్రజలకు ఏం తక్కువ చేశామని ఓడిపోయాం.
జరిగిన తప్పులను సవరించుకోవడానికైనా లోపాలు అంతుపట్టడం లేదని అన్నారు. తమ సొంత వ్యాపారాలు పక్కనపెట్టి, ప్రజలకే జీవితాన్ని అంకితం అన్న విధంగా గడిచిన 5 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు. సొంత పనులకు ప్రాధాన్యత ఇవ్వలేదని, కుటుంబాలను, వ్యక్తిగత పనులను పక్కనపెట్టి, అభివృద్ధి చేయాలనే తపనతో పనిచేశామని వెల్లడించారు. ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును సానుకూలంగా తీసుకుంటామని స్పష్టం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

