అమరావతి : ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వస్తున్న వరదలతో ప్రకాశం బ్యారేజ్ (Prakasam Barrage) నిండుకుండలా మారింది. అధికారులు ముందస్తుగా బ్యారేజ్ 70 గేట్లు ఎత్తి లక్షా 18 వేల క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో కృష్ణనది (Krishna River) పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు(Warning) జారీ చేశారు.
శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి 2.17 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా 6 గేట్లు ఎత్తి స్పిల్వే ద్వారా 1.67 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ కేంద్రాల ద్వారా 60 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి విద్యుదుత్పత్తి చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.