అమరావతి : భవిష్యత్‌లో జరుగబోయే విశాఖ కార్పొరేషన్ (Visaka Corporation) ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించేలా అందరూ సహాయ, సహకారాలు అందించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్( Deputy CM Pawan Kalyan) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం విజయవాడలోని మంగళగిరి పార్టీ కార్యాలయంలో విశాఖపట్నంకు చెందిన 5గురు వైసీపీ కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరా రు.
ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విభజన తరువాత రాష్ట్రం బలంగా ఉండాలనే లక్ష్యంతో కలిసి పనిచేశామని అన్నారు. వ్యక్తిగతంగా తనకు వైసీపీ శత్రువు కాదని అన్నారు. నాయకుల మాటల విధానం పార్టీ నష్టపోతుందని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గాలి, నీటి కాలుష్య సమస్య వైజాగ్‌లో ఎక్కువగా ఉందని వెల్లడించారు. కాలుష్యాన్ని నివారించేందుకు కార్పొరేటర్లపై బాధ్యత ఎక్కువగా ఉందని తెలిపారు.