ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు కౌంటర్ ఇచ్చారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేశారని బాబు మండిపడ్డారు. మాస్ కాపీయింగ్, లీకేజీలకు నారాయణను ఎలా బాధ్యుల్ని చేస్తారని బాబు ప్రశ్నించారు.
బాబు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పేపర్ లీక్‌ను సేవగా గుర్తించి, పద్మశ్రీ ఇవ్వాలా ఏంటి? అంటూ ట్విట్టర్ వేదికగా బాబుకు కౌంటర్ ఇచ్చారు. లీకు వీరుడు నారాయణను అరెస్ట్ చేస్తే ఎందుకింత ఎగిరిపడుతున్నావ్? అంటూ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.
పేపర్ల లీకును సేవగా గుర్తించి పద్మశ్రీ ఇవ్వాలా ఏంటి బాబూ? నీ అండతో అతిపెద్ద ఎడ్యుకేషన్ మాఫియాను సృష్టించి, లక్షలాది మంది పిల్లల జీవితాలతో ఆడుకున్న లీకు వీరుడు నారాయణను అరెస్ట్ చేస్తే ఎందుకింత ఎగిరిపడుతున్నావ్ బాబు? అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
పేపర్ల లీకును ‘సేవ’గా గుర్తించి పద్మశ్రీ ఇవ్వాలా ఏంటి బాబూ? నీ అండతో అతిపెద్ద ఎడ్యుకేషన్ మాఫియాను సృష్టించి లక్షలాది మంది పిల్లల జీవితాలతో ఆడుకున్న లీకు వీరుడు నారాయణను అరెస్ట్ చేస్తే ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావు?
1/2
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 11, 2022