అమరావతి : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరుమలకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తిరుమలకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి పద్మావతి అతిథిగృహం వద్ద స్వాగతం పలికారు. యోగి మల్లవరం వద్ద జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు.
రేపు ఉదయం వెంకయ్యనాయుడు శ్రీవారిని దర్శించు కుంటారని, పుష్పగిరి మఠంలో జరిగే మరో కార్యక్రమంలో పాల్గొని, తిరిగి మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుంటారని అధికారులు వెల్లడించారు.