అమరావతి : భారత ఉప రాష్ట్రపతి ( Vice President ) సీపీ రాధాకృష్ణన్ ( CP Radhakrishnan ) బుధవారం విజయవాడ దుర్గమ్మ ( Vijayawada Durgamma ) ను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి ఏపీలో పర్యటించారు.
బుధవారం సాయంత్రం విజయవాడలోని కృష్ణానది పున్నమి ఘాట్ వద్ద నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొనేందుకు విచ్చేసిన సందర్భంగా ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి, ఆలయ పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ , అధికారులు స్వాగతం పలికారు.
ఆలయంలో పూజలు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉపరాష్ట్రపతిని శాలువతో సన్మానించి అమ్మవారి ఫొటోను, తీర్థ ప్రసాధాలను అందజేశారు. దుర్గమ్మను దర్శించుకున్న ఆయన భక్తులతో కరచాలనం చేశారు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలించ్చారు.