అమరావతి : ఏపీలోని తూర్పు గోదావరి( East Godavari ) జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ( Road Accident ) లో ముగ్గురు మృతి చెందగా మరో 8 మందికి గాయాలయ్యాయి . నిర్మాణ పనుల కోసం బాపట్ల జిల్లా కొల్లూరు ప్రాంతం వెళ్లిన 11 మంది కూలీలు రెడీమిక్స్ వాల్స్ పనులు పూర్తి చేసుకుని సామగ్రితో బయల్దేరి వస్తుండగా రంగంపేట మండలం వడిశలేరు-రంగంపేట మార్గంలో టైర్ పంక్చరయి టాటా ఏస్ వాహనం బోల్తాపడింది.
ఈ ఘటనలో సామర్లకోటకు చెందిన మసకపల్లి బాబు, మురమర్ల రాజు, కాకడ రాజు తీవ్ర గాయాలతో చనిపోగా మరో 8 మందికి స్వల్పగాయాలయ్యాయి. వీరిని పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో 30 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉండగా ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యుల రోదనలో ఆసుపత్రి ఆవరణ విషాదంతో నిండిపోయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.