తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ( Padmavati Ammavari Temple ) వసంతోత్సవాలు ( Vasantotsavam ) ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈనెల 13 వరకు కొనసాగే ఉత్సవాతలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి అంకురార్పణతో వసంతోత్సవాలు ప్రారంభమయ్యాయి.
భక్తులు ఒక్కొక్కరు రూ.150 చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం , రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని వివరించారు. మే 12న ఉదయం 9.45 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుందని వెల్లడించారు.