Tirumala News : పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మీవ్రతం
Tirumala News | తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీకృష్ణ ముఖమండపంలో శుక్రవారం వరలక్ష్మీవ్రతం శాస్త్రోక్తంగా జరిగింది.

తిరుపతి : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీకృష్ణ ముఖమండపంలో శుక్రవారం వరలక్ష్మీవ్రతం శాస్త్రోక్తంగా జరిగింది. విష్వక్సేనారాధనతో ప్రారంభించి పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి తదితర పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామర, వృక్షి తదితర పుష్పాలతో ఆరాధించారు. అదేవిధంగా అమ్మవారిని 9 గ్రంథులతో అలంకరించారు. వరలక్ష్మీ వ్రతం మహత్యాన్ని, ఆచరించాల్సిన విధానాలను ఆగమ పండితుడు శ్రీ శ్రీనివాసాచార్యులు తెలిపారు. ఐదు రకాల కుడుములతోపాటు 12 రకాల నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు.
అనంతరం మహా మంగళ హరతితో వరలక్ష్మీ వ్రతం ముగిసింది. భక్తుల కోసం శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, రాష్ట్ర మంత్రి వేణుగోపాల కృష్ణ, టీటీడీ ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, జేఈఓ సదా భార్గవి, సీవీఎస్ఓ గోపీనాథ్ జెట్టి, అదనపు సీవీఎస్ఓ శివకుమార్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ కస్తూరి బాయి, ఏఈఓ ప్రభాకర్‌రెడ్డి, అర్చకులు బాబుస్వామి పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

