AP News | అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన ప్రమాదంలో సహాయక చర్యలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విమర్శించారు. మదనపల్లిలో పేపర్లు తగలబడితే హెలికాప్టర్ పంపించారని, ఉత్తరాంధ్ర ప్రజల ప్రాణాల కోసం ఒక్క హెలికాప్టర్ పంపలేరా? అని ప్రశ్నించారు. పేపర్లకు ఉన్న విలువ కార్మికుల ప్రాణాలకు లేవా అని ధ్వజమెత్తారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడానికి హోం మంత్రి వంగలపూడి అనిత అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వరుదు కల్యాణి విమర్శించారు. అనిత భాష చూసి ప్రజలు సిగ్గు పడుతున్నారని అన్నారు. అనిత సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అనిత ఒక అసమర్థ హోం మినిస్టర్ అని ఎద్దేవా చేశారు. హోం మంత్రిగా అనిత విఫలమయ్యారని వరుదు కల్యాణి విమర్శించారు. ఎప్పుడూ జగన్‌ను తిట్టడమే ఆమె పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఏనాడైనా అనిత స్పందించారా అని ప్రశ్నించారు.
ఫ్యాక్టరీల భద్రతపై ఏనాడైనా సమీక్షలు చేపట్టారా? అని హోంమంత్రి అనితను వరుదు కల్యాణి ప్రశ్నించారు. కొంచెం కూడా అవగాహన లేకుండా అనిత మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా వైఎస్ జగన్‌పై విమర్శలు పక్కనబెట్టి ఫార్మా ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టాలని సూచించారు. అనితకు సన్మానాల మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని వరుదు కల్యాణి మండిపడ్డారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాద సమయంలో వైఎస్ జగన్ పరామర్శకు రాలేదని అనిత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.