అమరావతి : బీసీల ముద్దుబిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న (Vadde Obanna) జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా (Officially ) నిర్వహించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) ట్విటర్ వేదికగా వెల్లడించారు.
1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటునే ప్రథమ స్వాతంత్య్ర యుద్ధం అంటారని, కానీ అంతకుముందే 1846లో తెలుగునాట ఉయ్యాలవాడ నరసింహ రెడ్డితో కలిసి బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వడ్డే ఓబన్న తెలుగువారి ఆత్మగౌరవం నిలపడం కోసం వీరోచితంగా పోరాడారని సీఎం పేర్కొన్నారు.
ఆనాటి రేనాటి వీరుడు వడ్డే ఓబన్న చరిత్రను నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయించామని ఆయన తెలిపారు. వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి మంత్రి లోకేష్ నివాళి అర్పించారు. వడ్డే ఓబన్నకు ఆదర్శంగా మెరుగైన సమాజం నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.