అమరావతి : ఏపీలోని రాజమండ్రి ఎయిర్‌పోర్టులో (Rajahmundry Airport) ప్రమాదంపై కేంద్ర విమానాయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Minister Rammohan naidu) స్పందించారు. శుక్రవారం ఎయిర్‌పోర్టులో కొత్త టెర్మినల్ భవన పనులు జరుగుతుండగా కొంతభాగం కుప్పకూలింది (Collapse) . దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు క్షేమంగా బయటపడ్డారు.
దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి రామ్మోహన్నాయుడు రాజమండ్రి ఎయిర్‌పోర్టు ఘటన విషయం తెలుసుకుని ఎయిర్పోర్ట్ అథారిటీ, పౌరవిమానయాన అధికారులతో మాట్లాడారు. ఘటనపై విచారణ జరిపి వెంటనే తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
రాజమండ్రి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాను (International Airport) కల్పించేందుకు 2023లో నాటి కేంద్ర విమానాయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కొత్త టెర్మినల్ (New terminal ) భవన పనులకు భూమి పూజ చేశారు. సుమారు రూ. 350 కోట్లతో కొనసాగుతున్న పనులు కొనసాగుతున్నాయి. ఈ ఎయిర్పోర్ట్ భవిష్యత్తులో రాత్రివేళ కూడా విమానాల ల్యాండింగ్ అయ్యేలా, టేకాఫ్ తీసుకునేలా విస్తరించడానికి చర్యలను తీసుకుంది కేంద్రప్రభుత్వం.
ప్రస్తుతం రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి వారానికి 126 ఫ్లైట్లు రాకపోకలు సాగిస్తున్నాయి. రాజమండ్రి- హైదరాబాద్, రాజమండ్రి- చెన్నై, రాజమండ్రి- బెంగళూరుకు విమానాలు నడుస్తున్నాయి. ఇప్పుడున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని దీన్ని మరింత విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది.