తిరుమల : తిరుమల, తిరుపతి పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలో 5 జలశయాలు నిండుకుండలా తలపిస్తున్నాయి. కురుస్తున్న వర్షంతో ఘాట్రోడ్డులో జలపాతాలను తలపిస్తూ వర్షపు నీరు ప్రవహిస్తుంది.
తిరుమల కొండపైకి వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు జారిపడుతున్నాయి. దీంతో నడకమార్గంలో భక్తులకు అనుమతులను టీటీడీ అధికారులు నిలిపివేశారు.