Ugadi Asthanam | మార్చి 30న గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉగాది ఆస్థానం
Ugadi Asthanam | తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మార్చి 30న ఉగాది పర్వదినం సందర్భంగా ఆస్థానం జరుగనుంది.
తిరుపతి : తిరుపతి( Tirupati ) శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మార్చి 30న ఉగాది ( Ugadi ) పర్వదినం సందర్భంగా ఆస్థానం జరుగనుంది. ఇందులో భాగంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహించి సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం (Ugadi Asthanam) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వివరించారు.
మార్చి 27న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు వివరించారు. మార్చి 30న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని వివరించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి ఉంటుందన్నారు.
అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారని తెలిపారు. అనంతరం భక్తులను ఉదయం 9.30 గంటల నుండి దర్శనానికి అనుమతిస్తారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

