అమరావతి: ఏపీలోని బాపట్ల (Bapatla) జిల్లా వేటపాలెం మండలంలో విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన యువకుల్లో ఇద్దరు నీట మునిగి మృతి చెందారు. మండలంలోని రామాపురం బీచ్(Ramapuram Beach) లో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
మంగళగిరికి చెందిన 12 మంది యువకులు( Youth ) ఆదివారం సముద్ర స్నానానికి రామాపురం బీచ్‌కు వెళ్లారు వీరంతా స్నానం చేస్తుండగా అలల ఉద్ధృతికి బాలసాయి(26), బాల నాగేశ్వరరావు(27) అనే ఇద్దరు యువకులు నీట మునిగి చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.