అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గోడ కూలిన ( Wall collapse ) ఘటనలో ఇద్దరు కూలిలు ( Two Labours ) మృతి చెందారు. విజయనగరం జిల్లా చిన్నారావు, ఎర్రిబాబు అనే ఇద్దరు కూలిలు గోడను కూల్చివేస్తుండగా ప్రమాదవశాత్తు వారి మీద పడింది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.
పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని మృతదేహాలను వెలికితీయించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు.