తిరుమల : టీటీడీ బోర్డు (TTD board members) ఎక్స్ అఫిషియో సభ్యుడిగా దేవాదాయశాఖ సెక్రటరీ హరి జవహర్ లాల్ ( Hari Jawahar Lal) , బోర్డు సభ్యులుగా సుదర్శన్ వేణు (Sudarsan Venu ) శనివారం శ్రీవారి ఆలయంలో ప్రమాణస్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అదనపు ఈవో అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండిపోయి కృష్ణా తేజ గెస్టుహౌజ్ వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 69,842 మంది భక్తులు దర్శించుకోగా 28,234 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.18 కోట్లు వచ్చినట్లు వివరించారు.