అమరావతి : కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఇద్దరు మృతి చెందారు. జాతీయ రహదారిపై ఆదివారం రెండు ఆటోలు(Autos) ఢీకొనగా కర్ణాటకకు (Karnataka) చెందిన రత్నబాయి, ఈసన్న అనే ఇద్దరు మృతి చెందారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ క్షతగాత్రులను పోలీసులు ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.