Srisailam | శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కొలువైన శ్రీశైలం ఆలయంలో మంగళవారం సుబ్రహ్మణ్యస్వామికి విశేష పూజలు నిర్వహించారు. లోక కల్యాణం కాంక్షిస్తూ దేవస్థానం సర్కారీ సేవగా నిర్వహించింది. మంగళ, కృతికానక్షత్రం, షష్ఠి తిథుల్లో కుమారస్వామికి విశేష అభిషేకం, విశేష పూజలను శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తూ వస్తున్నది. అభిషేకానికి ముందు దేశంలో శాంతి, సౌభగ్యాలు విలసిసల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా తగినంత వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా కురవాలని.. ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో ఉండాలని అర్చకులు మొదట సంకల్పం పటించారు. అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ నిర్వహించారు. అనంతరం కుమారస్వామికి అభిషేకం పంచామృతాలు, వివిధ ఫలరసాలతో అభిషేక అభిషేకం చేశారు.