TTD | తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ పదార్థాలు వాడారని విమర్శలు వస్తున్నాయి. దీంతో శ్రీవారి లడ్డూ అపవిత్రంపై వస్తున్న సందేహాలను టీటీడీ నివృత్తి చేసింది. ఈ మేరకు ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతా ద్వారా రియాక్టయింది. శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో పవిత్రతను పునరుద్ధరించామని తెలిపింది. గతంలో వాడిన నెయ్యి, ఇప్పుడు ఉపయోగించిన నెయ్యి వివరాలతో కూడిన నివేదికను వెల్లడించింది. నెయ్యిలో కల్తీ ఉందని పేర్కొంటూ నిర్ధారించిన ల్యాబ్ నివేదిక.. దాని పక్కనే నందిని నెయ్యి ల్యాబ్ నివేదికను టీటీడీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. తద్వారా లడ్డూ ప్రసాదంలో నాణ్యతపై శ్రీవారి భక్తుల్లో ఉన్న అపోహలను తొలగించడానికి టీటీడీ ప్రయత్నించింది.
The Sanctity of Srivari Laddu Prasadam is Restored Again#SrivariLaddu#TirumalaLaddu#LadduPrasadam#TTD#TTDAdministration #TTDevasthanams#OldSuppliers#NewSuppliers#LabReport#Ghee#SValue#GheeQuality pic.twitter.com/1aEhLonqzt
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) September 21, 2024