అమరావతి : తిరుపతిలో టీటీడీ రిటైర్ట్ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. తిరుపతిలోని ఎంఆర్ పలెల్లో అర్ధరాత్రి నారాయణస్వామిని దుండగులు కొట్టి చంపారు. తన గోల్డ్చైన్ పోయిందని ఇటీవల స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల నుంచి స్పందన రాకపోవడంతో నారాయణస్వామి మరోసారి ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు నారాయణస్వామి ఇంటిపక్కన ఉండేవారిని ప్రశ్ని స్తున్న సమయంలో నిన్న రాత్రి దారుణ హత్యకు గురికావడం సంచలనం కలిగించింది.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.