హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి నవంబర్ నెల దర్శనాలు, గదుల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)వెల్లడించింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన నవంబర్ కోటాను ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు, ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆగస్టు 20న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నది. ఈ టికెట్లు పొందినవారు ఆగస్టు 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటల్లోగా సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరుకానున్నాయి.