ఉన్నత లక్ష్యాలను సాధించడమే నిజమైన సంతోషం : టీటీడీ ఈవో
Inspection| విద్యార్థి దశలో ఉన్నత లక్ష్యాన్ని నిర్ణయించుకుని దాన్ని సాధించడమే నిజమైన సంతోషమని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి అన్నారు.
తిరుపతి : విద్యార్థి దశలో ఉన్నత లక్ష్యాన్ని నిర్ణయించుకుని దాన్ని సాధించడమే నిజమైన సంతోషమని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి అన్నారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాలకు న్యాక్ ఎ ప్లస్ గ్రేడ్ లభించిన సందర్భంగా సోమవారం కళాశాలను సందర్శించారు. భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువచ్చేలా చదువుకోవడమే నిజమైన సంతోషమని తెలిపారు.
విద్యార్థులు మంచి చదువులు చదివి భవిష్యత్తులో ఏ ఉన్నత స్థాయికి చేరుకున్నా తమను గుర్తు పెట్టుకునే లా గురువుల పనితీరు ఉండా లన్నారు. గురుశిష్యుల బంధాన్ని మరింత పటిష్టం చేసి సమాజ ఉన్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
భగవద్గీత మానవ సమాజానికి సంబంధించిన ఒక సైన్స్ లాంటిదని, దీన్ని అర్థం చేసుకుని కొంతవరకైనా ఆచరిస్తే మంచి వారిగా తయారు కావచ్చన్నారు. ఈవో కళాశాలలోని అన్ని ల్యాబ్‌లు, హాస్టల్ గదులు, వంటశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట జెఈవో సదా భార్గవి, డీఈవో గోవిందరాజన్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

