అమరావతి : వైఎస్సార్ కడప (YSR district) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామంలో ఒకే కుటుంబానికి నలుగురు ఆత్మహత్య (Suicide) చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. అప్పుల (Debt) బాధతో భార్య, ఇద్దరు పిల్లలతో రైతు నాగేంద్ర ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో భర్త నాగేంద్ర, భార్య వాణి, కుమారుడు భార్గవ్, కుమార్తె గాయత్రి ఉన్నారు.
గత కొంతకాలంగా నాగేంద్ర సొంత పొలంతో పాటు కౌలుకు భూమి తీసుకుని సాగు చేస్తున్నాడు. రూ. 20 లక్షల అప్పులు తీర్చలేక సొంత పొలంలోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు (Police) ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.