అమరావతి : ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) లో విషాద ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం వద్ద పెన్నానదిలో ఆరుగురు పశువుల కాపర్లు ( Cattle Herders ) గల్లంతు అయ్యారు. పశువులను మేపడానికి వెళ్లి తిరిగివస్తుండగా ఒక్కసారిగా వరద పెరగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంకటరమణయ్య, శ్రీనివాసులు, కాలేషా, చెన్నయ్య, కవిత, మరో మహిళ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. గల్లంతయైన వారిని కాపాడేందుకు పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు మొదలు పెట్టారు.