Soumya Shetty | ఫ్రెండ్ ఇంటికి కన్నం వేసి గోవా చెక్కేసిన తెలుగు హీరోయిన్.. బండారం ఇలా బయటపడింది!
Soumya Shetty | ఆమె సోషల్‌మీడియాలో ఓ ఇన్ఫ్లూయెన్సర్.. సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న హీరోయిన్.. ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్న ఆమె సినిమాల్లో పెద్ద ఛాన్స్‌లు కొట్టేస్తుందేమో అనుకుంటే.. ఫ్రెండ్ ఇంటికే కన్నం వేసింది. నమ్మి బెడ్రూం దాకా రానిస్తే.. కిలో బంగారం కొట్టేసింది. కూల్‌గా గోవా చెక్కేసింది. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడటంతో జైలులో ఊచలు లెక్కపెడుతోంది.
Soumya Shetty | ఆమె సోషల్‌మీడియాలో ఓ ఇన్ఫ్లూయెన్సర్.. సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న హీరోయిన్.. ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్న ఆమె సినిమాల్లో పెద్ద ఛాన్స్‌లు కొట్టేస్తుందేమో అనుకుంటే.. ఫ్రెండ్ ఇంటికే కన్నం వేసింది. నమ్మి బెడ్రూం దాకా రానిస్తే.. కిలో బంగారం కొట్టేసింది. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడటంతో జైలులో ఊచలు లెక్కపెడుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. వైజాగ్‌కు చెందిన సౌమ్య శెట్టికి యాక్టింగ్, సినిమాలు అంటే పిచ్చి. ఆ ఆసక్తితోనే పలు షార్ట్ ఫిలింస్‌లో నటించింది. చిన్న చిన్న సినిమాల్లోనూ ఆమెకు ఛాన్స్‌లు వచ్చాయి. యువర్స్ లవింగ్లీ, ది ట్రిప్ సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసుకుంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇలా ఆడిషన్స్ ఇస్తున్న సమయంలోనే వైజాగ్‌లోని దొండపర్తి బాలాజీ మెట్రో అపార్ట్మెంట్లోని ప్లాట్ నెంబర్ 102లో పోస్టల్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి జనపాల ప్రసాద్ బాబు తన కూతురు మౌనికతో ఆమెకు పరిచయం ఏర్పడింది. 2016లో ఏర్పడిన ఈ పరిచయం కాస్త తరచూ వాళ్ల ఇంటికి వెళ్లే వరకూ వచ్చింది. ఆ చనువుతో ఇంట్లో పరిసరాలన్నీ స్కాన్ చేసిన సౌమ్యకు.. మౌనిక ఇంట్లో ఉన్న కిలో బంగారం కంటపడింది. దీంతో ఎలాగైనా ఆ బంగారం కొట్టేయాలని అనుకున్న సౌమ్య.. మౌనిక ఇంటికి వెళ్లినప్పుడల్లా నేరుగా బెడ్రూంలోకి వెళ్లి.. బాత్రూం వాడుకుంటానని చెప్పి గంటలు గంటలు గడిపేది. ఇలా రెండు మూడు సార్లు చేసిన సౌమ్య.. ప్రతిసారి తన చేతివాటం ప్రదర్శించింది. విడతల వారీగా కిలో బంగారం కొట్టేసింది. కూల్‌గా గోవాకు చెక్కేసింది.
మౌనిక కుటుంబ సభ్యులు ఫిబ్రవరి 23 యలమంచిలోని బంధువుల వివాహానికి వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో బంగారు నగల కోసం బీరువా లాకర్ తెరవగా అందులో ఆభరణాలు కనిపించలేదు. దీంతో కంగారుపడిపోయిన మౌనిక తండ్రి ప్రసాద్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. క్లూస్ టీమ్ సహాయంతో బీరువాపై ఉన్న ఫింగర్ ప్రింట్స్‌ను సేకరించింది. అలాగే ప్రసాద్‌బాబు, మౌనికను విచారించగా ఇటీవల వాళ్లింటికి వచ్చిన పలువురిపై అనుమానం ఉందని తెలిపారు. దీంతో పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి 11 మంది అనుమానితులపై దర్యాప్తు చేపట్టారు. వీరిలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలోనే హీరోయిన్ బండారం బయటపడింది. సౌమ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె నుంచి 74 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన బంగారం గురించి అడిగితే.. తిరిగి ఇవ్వలేనని.. గట్టిగా అడిగితే సూసైడ్ చేసుకుంటానని రివర్స్‌లో బెదిరించిందని తెలుస్తోంది. సౌమ్యను కోర్టులో హాజరుపరచగా 15 రోజులు రిమాండ్ విధించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mrunal Takhur | ఇతరుల జీవితాలపై కామెంట్స్ చేయడానికి మీరెవరు.. మృణాల్ ఠాకూర్ సీరియస్
Ajinkya Shinde | సీజేపీ నిరసనల బాధ్యతలు అజింక్య షిండేకు.. ఆయన ఎవరంటే?
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

