Tirumala | హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో సిట్ మరో వ్యాపారిని అరెస్టు చేసింది. ఢిల్లీ కేంద్రంగా కల్తీ నెయ్యికి వినియోగించే రసాయనాలను అజయ్‌కుమార్ భోలేబాబా డెయిరీకి సరఫరా చేసినట్టు సిట్ గుర్తించింది. నిందితుడిని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు.