Tirupathi | ఏపీలోని తిరుపతిలో ఓ ఏఎస్సై హల్చల్ సృష్టించాడు. ఫ్రీగా బిర్యానీ ఇవ్వాలంటూ మద్యం మత్తులో హోటల్ యజమానిని చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.
సత్యనారాయణపురంలోని పూర్వీక కర్రీ సెంటర్ వద్దకు వెళ్లిన ఏఎస్సై రాము బిర్యానీ, చికెన్ కర్రీ పార్సిల్ కట్టించుకున్నాడు. డబ్బులు ఇవ్వకుండా రాము పార్సిల్ తీసుకెళ్తుండటంతో హోటల్ నిర్వాహకుడు అడ్డుకున్నాడు. డబ్బులు ఇవ్వాలని అడిగాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఏఎస్సై రాము.. తనను అడ్డుకున్నాడని కోపంతో ఊగిపోయాడు. నేను పోలీసును.. నన్నే డబ్బులు అడుగుతావా అని మండిపడ్డాడు. ఈ క్రమంలో హోటల్ నిర్వాహకుడితో ఘర్షణ మొదలైంది.
తిరుపతిలో మద్యం మత్తులో ఏఎస్ఐ హల్చల్
ఉచితంగా బిర్యానీ ఇవ్వలేదని పూర్వీక సెంటర్లో ఉన్న హోటల్ యజమానిపై దాడికి దిగిన ఎస్పీఎఫ్ ఏఎస్ఐ రాము
నన్నే డబ్బులు అడుగుతావా అంటూ యజమానిపై దాడి చేయడంతో, తిరిగి ఏఎస్ఐపై దాడి చేసిన హోటల్ యజమాని pic.twitter.com/G9strjw9ce
— Telugu Scribe (@TeluguScribe) May 29, 2026
అది కాస్త ముదరడంతో హోటల్ నిర్వాహకుడిని ఏఎస్సై రాము చితకబాదాడు. దీనికి సంబంధించిన సోషల్మీడియాలో వైరల్గా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రాము తిరుమల ఎస్పీఎఫ్లో ఏఎస్సైగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేసినట్లు సమాచారం.