Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం 22 కపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టైమ్స్లాటెడ్ (SSD) దర్శనాల కోసం 9 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
నిన్న తిరుమల శ్రీవారిని 72,962 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,645 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఒక్కరోజులో 3.37 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.