Tirumala | సెప్టెంబర్ నెల తిరుమల శ్రీవారి దర్శన కోటా షెడ్యూల్ విడుదల
Tirumala | సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమల వేంకటేశ్వరస్వామి వివిధ దర్శనాలు, గదుల కోటా వివరాలను టీటీడీ సోమవారం విడుదల చేసింది.
తిరుమల : సెప్టెంబర్ నెలకు (September Quota ) సంబంధించి తిరుమల (Tirumala ) వేంకటేశ్వరస్వామి వివిధ దర్శనాలు, గదుల కోటా షెడ్యూల్ వివరాలను టీటీడీ సోమవారం విడుదల చేసింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను ఈనెల 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో ( Online ) విడుదల చేయనున్నామని వెల్లడించింది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ 20న ఉయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని సంబంధిత అధికారులు వివరించారు.
ఈ టికెట్లు పొందిన వారు జూన్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయని తెలిపారు. ఈనెల 21న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఉదయం 10 గంటలకు , వర్చువల్ సేవల కోటాను, దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని వివరించారు.
23న అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూన్ 23న ఉదయం 10 గంటలకు , శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్ లైన్ కోటాను, ఉదయం 11 గంటలకు, వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నామని వివరించారు .
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు , తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామన్నారు. పరకామణి సేవ, నవనీత సేవ, గ్రూప్ సూపర్వైజర్ల సేవల ఆగస్టు నెల కోటాను జూన్ 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని తెలిపారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

